Supreme Court: మూడు నెలల మారటోరియంపై స్పష్టత ఇవ్వండి... కేంద్రం, ఆర్బీఐకి సుప్రీం నోటీసులు

Supreme Court issues notices to Centre and RBI
  • రుణ చెల్లింపులపై మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ
  • కొన్ని బ్యాంకులు వర్తింపజేయడంలేదన్న క్రిడాయ్
  • సుప్రీంలో పిటిషన్ దాఖలు
లాక్ డౌన్ కారణంగా మధ్య తరగతి ప్రజలు, బలహీన వర్గాల ప్రజలకు ఊరట కలిగించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మారటోరియం ప్రకటన స్థిరాస్తి రంగానికి కూడా వర్తిస్తుందా? అనే విషయంలో స్పష్టత లేదని, దీనిపై తగిన వివరణ అవసరమని భావిస్తున్నామని భారత స్థిరాస్తి రంగ అభివృద్ధి సంస్థ (క్రిడాయ్) సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ సుప్రీంలో విచారణ చేపట్టారు.

జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ధర్మాసనం వాదనలు విన్న అనంతరం కేంద్రానికి, ఆర్బీఐకి నోటీసులు జారీచేసింది. మారటోరియం ఎవరెవరికి వర్తిస్తుందో చెప్పాలని కోరింది. తదుపరి విచారణ రెండు వారాలు వాయిదావేసింది. కాగా, క్రిడాయ్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఆర్బీఐ ప్రకటన అన్ని బ్యాంకులకు వర్తించేలా ఉన్నా, కొన్ని బ్యాంకులు మాత్రం మారటోరియం లబ్ధిని స్థిరాస్తి రంగానికి వర్తింపజేయడం లేదని వివరించారు.
Supreme Court
Centre
RBI
Lockdown
moratorium
India

More Telugu News