Maria Singh: భారత సంతతి చెఫ్ ను పెళ్లాడిన ఆస్ట్రియా యువరాణి ఆకస్మిక మృతి!

Austrian Princess Married To Indian Origin Chef Dies
  • చెఫ్ రిషి రూప్ సింగ్ భార్య మరియా హఠాన్మరణం
  • కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి
  • ఆమె వయసు 31 సంవత్సరాలు
భారత సంతతి చెఫ్ రిషి రూప్ సింగ్ ను పెళ్లాడిన ఆస్ట్రియా దేశపు యువరాణి మరియా గలిట్జైన్ హఠాన్మరణం చెందారు. అమెరికాలోని హ్యూస్టన్ లో కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆమె మృతి చెందారు. ఆమె వయసు 31 సంవత్సరాలు. వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. హ్యూస్టన్ లో నివసిస్తున్నారు. వీరికి రెండేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు.

రూప్ సింగ్ కు ఎగ్జిక్యూటివ్ చెఫ్ గా మంచి గుర్తింపు ఉంది. మారియా ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ప్రిన్సెస్ మరియా అన్నా, ప్రిన్స్ పియోటర్ గలిట్జైన్ ల కుమార్తె మరియా. మే 4న ఆమె చనిపోయినట్టు ఫాక్స్ న్యూస్ తెలిపింది. ఆమె మృతి చెందిన నాలుగు రోజుల తర్వాత ఫారెస్ట్ పార్క్ సెమెటరీలో అంత్యక్రియలు నిర్వహించారని పేర్కొంది.

మరియాకు ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. 1988లో లగ్జెంబర్గ్ లో ఆమె జన్మించారు. ఆమెకు 5 ఏళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం రష్యాకు తరలివెళ్లింది. బెల్జియంలో ఆమె ఆర్ట్ అండ్ డిజైన్ లో విద్యాభ్యాసం చేశారు. బస్సెల్స్ తో పాటు షికాగో, ఇల్లినాయిస్, హ్యూస్టన్ లో ఆమె పని చేశారు.
Maria Singh
Rishi Roop Singh
Chef
Designeer
Austria
Princess
Houston

More Telugu News