రైతులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు... జాతీయ చట్టం తీసుకువస్తాం: నిర్మలా సీతారామన్
- ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడ అమ్ముకోవచ్చని వెల్లడి
- అంతర్రాష్ట్ర వాణిజ్యానికి ప్రోత్సాహం
- లైసెన్స్ పొందిన వ్యాపారులకే విక్రయించాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంతర్రాష్ట్ర వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తామని, రైతులు ఏ రాష్ట్రంలోనైనా తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చన్నారు. దేశంలో ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడే తమ ఉత్పత్తులు విక్రయించుకోవచ్చని, అలాగే తమకు అనుకూల ధరకు కొనుగోళ్లు కూడా జరపవచ్చని ఈ మేరకు జాతీయస్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకువస్తామని వివరించారు. లైసెన్స్ పొందిన వ్యాపారులకే విక్రయించాల్సిన అవసరం ఇక మీదట ఉండదని, వ్యవసాయ రంగ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై పరిమితులు తొలగిస్తున్నామని చెప్పారు.