KCR: గోదావరి నదీ జలాల వినియోగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం

  • ఈ నెల 17న సీఎం ఆధ్వర్యంలో సమావేశం
  • ఉదయం 11 గంటల నుంచి రోజంతా సమావేశం
  • హాజరు కానున్న మంత్రులు, అధికారులు
CM KCR meets ministers and officials to discuss on Godavari waters

రానున్నది వర్షాకాలం కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటినుంచే నదీ జలాల వినియోగం ప్రణాళికలపై దృష్టి పెట్టారు. ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించడం కోసం ఈ నెల 17న సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి గోదావరి ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాలకు చెందిన మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి రోజంతా కొనసాగుతుందని తెలంగాణ సీఎంవో వెల్లడించింది. కాగా, ఈ వర్షాకాలంలో గోదావరి ప్రాజెక్టుల నుంచి నీరు ఎప్పుడు, ఎంత మేర విడుదల చేయాలి? ఎస్సారెస్పీ, ఎల్ఎండీలకు నీళ్లు ఎప్పుడు తరలించాలి? మిగిలిన రిజర్వాయర్లకు నీటిని ఎప్పుడు తరలించాలి? నీటిని ఎలా వినియోగించుకోవాలి? అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

More Telugu News