anasuya: పుట్టిన రోజు సందర్భంగా సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి యాంకర్ అనసూయ సేవా కార్యక్రమాలు

anasuya fires birthday special
  • కీసర మండలంలో సేవా కార్యక్రమాలు
  • 100 మంది గర్భిణి స్త్రీ లకు పోషకాహార కిట్స్‌ పంపిణీ
  • అక్కడకు వచ్చిన వారితో ఆమె అప్యాయంగా మాట్లాడిన అను
యాంక‌ర్‌, సినీ న‌టి అన‌సూయ తన పుట్టిన రోజు సంద‌ర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. కీసర మండలంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌తో కలిసి దాదాపు 100 మంది గర్భిణి స్త్రీలకు ఆమె పోషకాహార కిట్స్‌ను పంపిణీ చేసింది. అక్కడకు వచ్చిన వారితో ఆమె అప్యాయంగా మాట్లాడింది. ఆ ప్రాంతంలోని చీర్యాలలో ఉన్న‌ ఓ ఫంక్ష‌న్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనసూయను సీపీ మహేశ్ భగవత్‌ అభినందించారు.
                
మరోపక్క, అనసూయ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుట్టిన రోజు నాడు ఆమె పాల్గొన్న సేవా కార్యక్రమంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జబర్దస్త్ వంటి టాప్‌ ప్రోగ్రాంతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ పలు సినిమాల్లోనూ నటించి, ప్రేక్షకులను మెప్పించింది.
            
anasuya
Jabardasth

More Telugu News