Anil Kumar Yadav: ‘పోతిరెడ్డిపాడు’పై ఆ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు: ఏపీ మంత్రి అనిల్

Minister AnilkumarYadav Statement
  • మాకు రావాల్సిన  నదీ జలాల వాటానే తీసుకుంటున్నాం 
  • సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలు తీసుకుంటే నష్టమేంటి?
  • ఈ విషయంలో మా నిర్ణయం మాదే
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. పొలిటికల్ స్టంట్ కోసమే తెలంగాణలోని కొందరు రాజకీయనాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

తమకు రావాల్సిన కృష్ణా నదీ జలాల వాటాను మాత్రమే తాము తీసుకుంటున్నామని చెప్పారు. సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలను తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టమేంటో తమకు అర్థం కావడం లేదని అన్నారు. ఈ విషయంలో తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తమ నిర్ణయం తమదేనని, తెలంగాణ వాళ్ల నిర్ణయం వాళ్లదేనని స్పష్టం చేశారు.
Anil Kumar Yadav
YSRCP
Andhra Pradesh
pothireddypadu project

More Telugu News