Corona Virus: మరో 57 మంది ఏపీ వాసులకు కరోనా నిర్ధారణ

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. పరీక్షలు నిర్వహిస్తున్న కొద్దీ కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,038 శాంపిళ్లను పరీక్షించగా మరో 102 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 57 మంది ఉండగా, 45 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలకి చెందినవి (మహారాష్ట్ర 34, రాజస్థాన్ 11) అని వివరించింది.

గత 24 గంటల సమయంలో 60 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,157గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 857 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,252 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 48కి చేరింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 4, చిత్తూరులో 14, తూర్పుగోదావరిలో 1, కడపలో 2, కృష్ణా జిల్లాలో 9, కర్నూలులో 8, నెల్లూరులో 14, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 3,  కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.
                     
జిల్లాల వారిగా కేసుల వివరాలు..
        
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News