Pawan Kalyan: వ్యవసాయ కూలీల దుర్మరణం బాధాకరం: పవన్ కల్యాణ్

Pawan Kalyan express grief over Prakasham district accident
  • ప్రకాశం జిల్లాలో దుర్ఘటన
  • ప్రమాదానికి గురైన ట్రాక్టర్
  • 9 మంది వ్యవసాయ కూలీలు, ఓ రైతు మృతి
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది వ్యవసాయ కూలీలు, ఓ రైతు మరణించడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిర్చి తోటల్లో పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న కూలీలు ట్రాక్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడం అత్యంత విచారకరం అని వ్యాఖ్యానించారు. మృతుల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఉన్నారని తెలిసి బాధపడ్డానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఉదారంగా పరిహారం ఇచ్చి ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Pawan Kalyan
Road Accident
Prakasam District
Death

More Telugu News