Road Accident: ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతులు వీరే!

Dead bodies of Prakasham district accident send to Ongole RIMS
  • విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
  • 9 మంది కూలీలు, ఓ రైతు మరణించినట్టు గుర్తించిన అధికారులు
  • మృతదేహాలు ఒంగోలు రిమ్స్ కు తరలింపు
ప్రకాశం జిల్లా రాపర్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారిని అధికారులు గుర్తించారు. మాచవరం నుంచి రాపర్లకు మిర్చి కోతకు వెళ్లిన కూలీలు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్ విద్యుత్ స్తంభంపై పడడంతో కరెంటు తీగలు తెగి కూలీలపై పడ్డాయి. ఈ ఘటనలో 9 మంది కూలీలు అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు నిర్ధారించారు. మరో రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతి చెందిన కూలీల్లో ఏడుగురు మహిళలు కాగా, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు కూడా ఉన్నారు. కూలీల మృతదేహాలను ఒంగోలు రిమ్స్ కు తరలించారు.

మాచవరం గ్రామానికి చెందిన కూలీలు కోటేశ్వరమ్మ (50), లక్ష్మమ్మ (65), కాకుమాను రమాదేవి (55), కాకుమాను కుమారి (45), కాకుమాను రాణిశ్రీ (40), కాకుమాను అమూల్య (18), రవిశంకర్ (20), కాకుమాను శివ (17), కాకుమాను మౌనిక (18) ఈ ప్రమాదంలో మరణించినట్టు గుర్తించారు.
Road Accident
Prakasam District
Dead Bodies
RIMS
Ongole

More Telugu News