Mary Kom: ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ ను సర్ ప్రైజ్ చేసిన ఢిల్లీ పోలీసులు

Delhi police surprises boxer Mary Kom family
  • మేరీ కోమ్ తనయుడి పుట్టినరోజున కేక్ తెచ్చిన పోలీసులు
  • సంభ్రమాశ్చర్యాల్లో మునిగిన మేరీకోమ్ కుటుంబం
  • మీరు యోధులు అంటూ సెల్యూట్ చేసిన బాక్సర్
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో పోలీసుల సేవలు ఎనలేనివి. ప్రాణాలను లెక్కచేయకుండా ముందు నిలిచి కరోనాపై పోరాటం సాగిస్తున్న వీరులుగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. తాజాగా, ఢిల్లీ పోలీసులు ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ ను ఊహించని రీతిలో సర్ ప్రైజ్ చేశారు. మేరీ కోమ్ తనయుడు ప్రిన్స్ కోమ్ పుట్టినరోజు సందర్భంగా ఓ కేక్ తీసుకువచ్చి మేరీ కోమ్ కుటుంబ సభ్యులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.

తన కుమారుడి పుట్టినరోజు అని తెలుసుకోవడమే కాకుండా, ఓ కేక్ కూడా తీసుకురావడం పట్ల మేరీ కోమ్ కదిలిపోయారు. వారికి సెల్యూట్ చేశారు. కరోనాపై ముందు వరుసలో నిలిచి పోరాడుతున్న యోధులు మీరు అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ పాట కూడా పాడడం విశేషం. లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమైన వేళ తమ కుటుంబంలో ఆనందం నింపారంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు, ఏసీపీ ప్రగ్యా ఆనంద్ కు మేరీ కోమ్ కృతజ్ఞతలు తెలిపారు.

Mary Kom
Delhi Police
Cake
Prince Kom
Birthday
Lockdown

More Telugu News