Chandrababu: 400 మందికి పైగా తెలుగు ఎన్నారైలు ఇక్కడ చిక్కుకుపోయారు... దయచేసి సమస్యను పరిష్కరించండి: కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి

  • లాక్ డౌన్ కు ముందు భారత్ వచ్చిన ఎన్నారైలు
  • లాక్ డౌన్ ప్రకటించడంతో ఇక్కడే చిక్కుకుపోయిన వైనం
  • ఓ యువతి ట్వీట్ కు స్పందించిన చంద్రబాబు
Chandrababu requests Centre to solve NRIs problems

కరోనా వైరస్ భూతం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో కష్టాలను తెచ్చిపెట్టింది. విదేశాల్లో ఉంటున్న అనేకమంది ఎన్నారైలు కూడా లాక్ డౌన్ కు ముందు భారత్ వచ్చి ఇక్కడే చిక్కుకుపోయారు. దీనిపై ఓ యువతి చేసిన ట్వీట్ కు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 400 మందికి పైగా తెలుగు ఎన్నారైలు ఏపీలోనూ, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి దురవస్థ ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ను కోరారు.

"జయశంకర్ గారూ ఎన్నారైల అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. లాక్ డౌన్ కు ముందు భారత్ వచ్చిన 400 మందికి పైగా తెలుగు ఎన్నారైలు ఇక్కడే నిలిచిపోయారు. ఈ ఎన్నారైల కుటుంబాలు అమెరికాలోనే ఉండిపోయాయి. వీళ్లేమో ఇక్కడ అమెరికా కాన్సులేట్ లో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

More Telugu News