Gujarath: పీపీఈ కిట్లు ధరించి హెయిర్‌ కటింగ్.. ఫొటో వైరల్

  • గుజరాత్‌, ఖేడా ప్రాంతంలోని సెలూన్ లో ఏర్పాటు
  • కస్టమర్లు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు
  • క్షురకులు, కస్టమర్లకు కరోనా సోకకుండా జాగ్రత్తలు 
Workers at Salon in Gujarats Kheda wear PPE kits while giving haircuts

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో హెయిర్ కటింగ్ సెలూన్లు తెరుచుకున్నాయి. అయితే, హెయిర్ కటింగ్ సెలూన్‌ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఖేడా ప్రాంతంలో ఓ హెయిర్ కటింగ్ సెలూన్‌లో క్షురకుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కటింగ్ చేస్తోన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అతడు వ్యక్తిగత పరిరక్షణ పరికరాలు (పీపీఈ) ధరించి మరీ హెయిర్ కటింగ్ చేస్తున్నాడు. అంతేకాదు, ఆ సెలూన్‌లో కస్టమర్లు కూడా అన్ని జాగ్రత్తలు పాటించేలా క్షురకుడు చర్యలు తీసుకుంటున్నాడు. ఆ సెలూన్‌కు వచ్చిన కస్టమర్లు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఉన్నారు. 

'ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలను మేము తీసుకుంటున్నాం. క్షురకులు, కస్టమర్లకు కరోనా సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం' అని ఆ సెలూన్ యజమాని విశాల్ లింయాచియా మీడియాకు తెలిపారు. కరోనా నుంచి కాపాడడానికి పీపీఈ కిట్లు అద్భుతంగా పనిచేస్తాయి.

More Telugu News