తుమ్మినా తుంపర్లు పడకుండా.. రెడీ అవుతున్న కొత్త తరం దగ్గుబిళ్ల
- దగ్గుబిళ్లను అభివృద్ధి చేస్తున్న అమెరికా పరిశోధకులు
- అది వేసుకోగానే బరువెక్కనున్న లాలాజలం
- తుంపర్లు గాల్లో కలవకుండా నేలపైకి
బయటకు వెళ్లడానికి ముందు ఈ బిళ్లలను నోట్లో వేసుకుంటే లాలాజలం బరువు పెరిగి చిక్కగా మారిపోతుంది. ఫలితంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతడి నోటి నుంచి వచ్చే తుంపర్లు గాల్లో కలవకుండా నేలపై పడిపోతాయి. ఫలితంగా కోవిడ్ రిస్క్ తగ్గుతుందన్నమాట.
మాస్కు ధరించి ఈ బిళ్లలను వేసుకుంటే భౌతిక దూరం రెండు అడుగులు పాటిస్తే సరిపోతుందని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకుల (యూసీఎఫ్) బృందం తెలిపింది. హైస్పీడ్ కెమెరాల ద్వారా ఈ దగ్గుబిళ్లపై పరిశోధన జరిపినప్పుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్లు ఎక్కువ దూరం వెళ్లకపోవడాన్ని వారు గమనించారు.