Lawyer: న్యాయమూర్తులు, లాయర్లు నల్లకోటు ధరించక్కర్లేదు: సుప్రీం స్పష్టీకరణ

Supreem Orders No Need to Wear Black Cote
  • నల్లకోట్లతో కరోనా ముప్పు
  • కొంతకాలం ధరించకుండా ఉండాలి
  • వైద్యుల సూచనలు పాటిద్దాం
కరోనా మహమ్మారి కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో, సంప్రదాయ నలుపు రంగు కోట్లు, గౌన్లను ధరించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, కరోనా సమసిపోయేంతవరకూ లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ ఈ ఆదేశాలు అమలవుతాయని వెల్లడించింది.

తెల్ల చొక్కా, నెక్ బ్యాండ్ ధరించి.. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఎస్ఏ బోబ్డే, సహచర న్యాయమూర్తులు, లాయర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, నలుపు రంగు కోట్లు, గౌన్ల వల్ల కరోనా వ్యాపించే ముప్పు పొంచివున్న కారణంగా కొంతకాలం వాటిని ధరించడం మానేద్దామని అన్నారు. వైద్యుల సూచనల మేరకు న్యాయవాదులు డిజైన్లు లేని తెలుపు చొక్కాలని, మహిళలు సల్వార్ కమీజ్ లేదా తెల్ల చీరను ధరించి వాదించవచ్చని, తెలుపు రంగు నెక్ బ్యాండ్ ను ధరించాలని సూచించారు.
Lawyer
Black Cote
Corona Virus
Supreme Court

More Telugu News