Train: మరో సడలింపు... రేపటి నుంచి రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ జారీ!

  • 22 నుంచి తిరిగే రైళ్లకు వర్తింపు
  • జారీ చేసే టికెట్ల సంఖ్య తగ్గింపు
  • వెల్లడించిన రైల్వే శాఖ
Train Waiting List Tickets from Tomorrow

ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో టికెట్ కన్ఫర్మ్ అయిన వారిని మాత్రమే అనుమతిస్తున్న రైల్వే శాఖ, 22 నుంచి తిరిగే రైళ్లలో మాత్రం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉంటాయని తెలిపింది. 22వ తేదీ నుంచి ప్రయాణాలకు 15న బుకింగ్స్ ప్రారంభం కానుండగా, వెయిటింగ్ లిస్ట్ టికెట్ల విక్రయాలు కూడా ఉంటాయని వెల్లడించింది.

 అయితే గరిష్ఠంగా ఇస్తున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్ల సంఖ్యను తగ్గించామని, స్లీపర్ క్లాసులో 200, చెయిర్ కార్, థర్డ్ ఏసీలో 100, సెకండ్ ఏసీలో 50, ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లలో 20 మాత్రమే వెయిటింగ్ లిస్ట్ టికెట్లను జారీ చేస్తామని స్పష్టం చేసింది.

కాగా, లాక్ డౌన్ కు ముందు నిత్యమూ 12 వేల రైళ్లను నడిపిన ఇండియన్ రైల్వేస్, లాక్ డౌన్ తరువాత అన్ని రైళ్లనూ నిలిపివేసింది. మే 1 నుంచి వలస కూలీలను తరలించేందుకు, ఆపై ప్రత్యేక రైళ్లను కలిపి, ఇప్పటివరకూ 366 రైళ్లను నడిపింది. ఇక దశలవారీగా రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News