America: కోవిడ్‌పై పోరులో భారత్‌కు అమెరికా సాయం.. రూ.3.6 మిలియన్ డాలర్లు ప్రకటన

America ready to give corona aid to India
  • భారీ సాయం అందించేందుకు సీడీసీ నిర్ణయం
  • ప్రయోగ శాలల సామర్థ్యాన్ని పెంచేందుకు నిధుల వినియోగం
  • కోవిడ్‌పై పోరులో భారత్‌కు మరింత బలం
కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారత్‌కు అమెరికా నుంచి భారీ ఆర్థిక సాయం అందనుంది. రూ.3.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించబోతున్నట్టు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించింది. దేశంలో కోవిడ్ ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచడం, ఇన్‌ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌(ఐపీసీ) కేంద్రాలను అభివృద్ధి చేయడం, కరోనా కేసుల గుర్తింపు తదితర వాటి కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు.
America
Corona Virus
India
AID

More Telugu News