Sensex: ఉద్దీపన ప్యాకేజీ ప్రభావంతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన మోదీ
  • బలపడిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • 637 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Sensex ends 637 points higher

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 637 పాయింట్లు లాభపడి 32,009కి పెరిగింది. నిఫ్టీ 187 పాయింట్లు పుంజుకుని 9,384కి చేరుకుంది. టెలికాం, హెల్త్ కేర్ మినహా మిగిలిన సూచీలు లాభాల్లో ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (7.02%), అల్ట్రాటెక్ సిమెంట్ (6.15%), ఎల్ అండ్ టీ (5.98%), ఐసీఐసీఐ బ్యాంక్ (5.04%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.44%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-5.38%), సన్ ఫార్మా (-2.47%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.80%), భారతి ఎయిర్ టెల్ (-0.70%).

More Telugu News