Rana: రానా... నీకు స్వాగతం: సోనమ్ కపూర్

Sonam Kapoor welcomes Rana to family
  • మిహీకాను పెళ్లాడబోతున్న రానా
  • వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • నిన్ను రానా బాగా చూసుకుంటాడన్న సోనమ్
సినీ నటుడు రానా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మిహీకా బజాజ్ అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. ఈ విషయాన్ని రానా నిన్న సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన వెంటనే... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రానాకు సోషల్ మీడియలో శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటి, స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ కూడా శుభాకాంక్షలు తెలిపింది.

''బేబీ మిహీకా కంగ్రాచ్యులేషన్స్. ఐ లవ్యూ డాలింగ్. అత్యుత్తమమైనవి పొందేందుకు నీవు అర్హురాలివి. నువ్వు సంతోషంగా ఉండేలా రానా చూసుకుంటాడు. మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా. లవ్యూ బోత్' అంటూ రానా, మిహీకా జంటకు సోనమ్ శుభాకాంక్షలు తెలిపింది. మిహికాకు, సోనమ్ కపూర్ కు మంచి స్నేహం ఉండటం గమనార్హం.
Rana
Sonam Kapoor
Miheeka Bajaj
Bollywood
Tollywood

More Telugu News