Corona Virus: ఏపీలో మరో 48 మందికి కరోనా.. కర్నూలులో 591కి చేరిన కేసులు

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న కొద్దీ కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,284 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 86 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,137గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 948 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,142 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటివరకు ఏపీలో 47 మంది కరోనా వల్ల మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 11, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 12,  కృష్ణాలో 3, కర్నూలులో 7 చొప్పున కేసులు నమోదయ్యాయని వివరించింది.ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కర్నూలులో కరోనా నిర్ధారిత కేసులు 591కి చేరాయి.
                     
జిల్లాల వారిగా కేసుల వివరాలు..
            గ్రాఫ్ రూపంలో..
               
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News