Sampath Kumar: కేసీఆర్, జగన్ మధ్య చీకటి ఒప్పందాలు: కాంగ్రెస్ నేత సంపత్ కుమార్

congress Accuses Secret Deals between kcr and jagan
  • రోజూ మాట్లాడుకుంటూనే ఉంటారు
  • జీవో వచ్చేంత వరకూ ఏం చేస్తున్నారు
  • కేసీఆర్ కు ముందే తెలిసుంటుందన్న సంపత్ 
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల నడుమ చీకటి ఒప్పందాలు నడుస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్‌ నేత సంపత్‌ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌, జగన్‌ కుటుంబీకుల్లో కొందరు నిత్యమూ ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉంటారని అన్నారు.

పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపుపై జీవో విషయం కూడా కేసీఆర్ కు ముందే తెలిసుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ సర్కారు జీవో తెచ్చేంతవరకూ కేసీఆర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం కెపాసిటీని పెంచడంపై కూడా ఎటువంటి అనుమతులు తీసుకోలేదన్నారు.
Sampath Kumar
Jagan
KCR

More Telugu News