Narendra Modi: కరోనా కష్టకాలంలో రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన మోదీ

PM Modi announces huge package of twenty lakhs rupees
  • ఆత్మ నిర్భర్ అభియాన్ పేరిట ప్యాకేజి
  • భారత ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చే నిర్ణయం అని వెల్లడి
  • భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారిందని వ్యాఖ్యలు
గత 4 నెలులుగా కరోనాతో పోరాడుతున్నామని, యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా శక్తివంచన లేకుండా శ్రమిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంటూ భారీ ప్యాకేజిని ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజి ప్రకటించారు. 21వ శతాబ్దం భారత్ దేనని, ఈ ప్యాకేజి అండగా మన దేశం మున్ముందు కూడా మరింత మెరుగైన ఆర్థిక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తాజా ప్యాకేజి భారత్ జీడీపీలో 10 శాతం ఉంటుందని అన్నారు. ఈ మొత్తాన్ని ప్రధానంగా వ్యవసాయం, కార్మికులు, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలపై వెచ్చించనున్నామని, పేదలు, వలస కార్మికులు, కూలీలు, మత్స్యకారులకు ఈ ప్యాకేజి ఊతమిస్తుందని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు వెల్లడిస్తారని మోదీ పేర్కొన్నారు. విపత్తును కూడా భారత్ అవకాశంగా మల్చుకుంటుందని తెలిపారు. ఇప్పుడు భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారిందని వివరించారు.
Narendra Modi
Atma Nirbhar Bharat Abhiyan
Lockdown
Corona Virus
COVID-19

More Telugu News