Narendra Modi: మే 18 నుంచి లాక్ డౌన్ కు కొత్త రూపు: మోదీ వెల్లడి

PM Modi says lock down phase four would be new
  • మే 17తో ముగియనున్న మూడో విడత లాక్ డౌన్
  • లాక్ డౌన్-4లోనూ అన్ని నియమాలు, జాగ్రత్తలు పాటిద్దామని పిలుపు
  • కరోనాపై సుదీర్ఘ పోరాటం తప్పదని వ్యాఖ్యలు
కరోనాపై సుదీర్ఘ యుద్ధం తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఓవైపు మహమ్మారితో యుద్ధం, మరోవైపు అభివృద్ధి కోసం పోరాటం చేయాల్సిందేనని జాతికి పిలుపునిచ్చారు. ఈ బాధ్యతను 130 కోట్ల మంది తలకెత్తుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మే 17తో మూడో దశ లాక్ డౌన్ ముగియనుండగా, మే 18 నుంచి లాక్ డౌన్ కు కొత్త రూపు రానుందని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్-4లో కూడా అన్ని నియమాలు, జాగ్రత్తలు పాటిద్దామని తెలిపారు.

అయితే ఈ నాలుగో విడత లాక్ డౌన్ లో కొన్ని కొత్త అంశాలు చోటుచేసుకుంటాయని, వాటిని మే 18 ముందు ప్రకటిస్తామని వెల్లడించారు. ఇక, కరోనా సంక్షోభంలో దేశీయ ఉత్పత్తిదారులే ఆధారమయ్యారని, డిమాండ్లకు తగిన విధంగా సరఫరాతో జాతి అవసరాలు తీర్చారని కొనియాడారు. భారత్ లో ఇకపై స్థానిక వస్తు వినియోగం పెరగాలని, మనవాళ్ల నుంచే వస్తువులు కొనుగోలు చేయాలని మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా ప్రాశస్త్యాన్ని మరోసారి నొక్కిచెప్పారు.
Narendra Modi
India
Corona Virus
Lockdown
Lockdown-4

More Telugu News