Chandrababu: ‘ఎల్జీ పాలిమర్స్’కు ఏఏ ప్రభుత్వాలు ఎంతెంత భూములిచ్చాయో సాక్ష్యాధారాలు ఉన్నాయి: చంద్రబాబు

  • 6 దశాబ్దాల క్రితం నుంచి ఇచ్చిన భూముల అనుమతుల సాక్ష్యాధారాలు ఉన్నాయి
  • పాలి స్టిరీన్ కు, ఎక్స్ పాండబుల్ పాలి స్టిరీన్ విస్తరణకు వైసీపీ సర్కార్ అనుమతిచ్చింది
  • ఆ సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయి
Chandrababu statement

విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు నాడు భూములిచ్చింది టీడీపీ హయాంలోనే అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. తమ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ విషయమై ఆయన ప్రస్తావించినట్టు సమాచారం.

‘ఎల్జీ పాలిమర్స్’ కు ఆరు దశాబ్దాల క్రితం నుంచి ఏఏ ప్రభుత్వాలు ఈ కంపెనీకి భూములు, అనుమతులు ఇచ్చారో తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పాలి స్టిరీన్ కు, ఎక్స్ పాండబుల్ పాలిస్టిరీన్ విస్తరణకు అనుమతి ఇచ్చిందని అన్నారు. ఈ మేరకు కేంద్రానికి వైసీపీ ప్రభుత్వం సిఫారసు చేసిందనేందుకు తమ వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. విశాఖ దుర్ఘటనకు కారణం మానవ తప్పిదమేనని, ఈ పరిశ్రమను తక్షణమే అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో అన్యాయం జరిగిన బాధితులకు న్యాయం చేసే బాధ్యత టీడీపీపై ఉందని, బాధితుల్లో భరోసా నింపాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపు నిచ్చారు.

More Telugu News