Priyadarshi: విలన్ రోల్స్ చేయాలని వుంది: నటుడు ప్రియదర్శి

Priyadarshi
  • విభిన్నమైన పాత్రల పట్ల ఆసక్తి
  • అన్ని రకాల పాత్రలు చేయగలను
  • కెరియర్ సంతృప్తికరంగా వుందన్న ప్రియదర్శి

మొదటి నుంచి కూడా ప్రియదర్శి విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. ఒక వైపున కమెడియన్ గా నవ్విస్తూనే, మరో వైపున కీలకమైన పాత్రలను చేస్తున్నాడు. తాజాగా ఆయన 'లూజర్' అనే వెబ్ సిరీస్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు.

తాజా ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ .. "విభిన్నమైన పాత్రలకి నేను ప్రాధాన్యతనిస్తూ ఉండటంతో, 'మీరు కమెడియన్ నా? కేరక్టర్ ఆర్టిస్ట్ నా? అని అడుగుతున్నారు. అన్నిరకాల పాత్రలను చేయగలనని అనిపించుకోవాలని ఉద్దేశంతోనే నేను ఈ రూట్లో వెళుతున్నాను. కామెడీ చేయడం చాలా తేలికని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి కామెడీ చేయడమే చాలా కష్టం. ఆ విషయంలోను మంచి మార్కులు తెచ్చుకున్నాను. కేరక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నంలో వున్నాను. ఇక విలన్ పాత్రలు చేయాలని వుంది. నటుడిగా నిరూపించుకోవాలంటే అన్నిరకాల పాత్రలు చేయాలనేదే నా ఉద్దేశం. ఇంతవరకూ నాకు లభించిన పాత్రల పట్ల సంతృప్తికరంగా వున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Priyadarshi
Actor
Tollywood

More Telugu News