Hero Ram: ఈసారి నా పుట్టినరోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలి: హీరో రామ్

Hero Ram potineni request to his fans
  • ఈ నెల 15న హీరో రామ్ పుట్టినరోజు
  • ఇప్పుడు సామాజిక దూరం అందరికీ శ్రేయస్కరం!
  • ఈ ఒక్కసారి మీరు పాటించే ఈ దూరమే నాకు ఇచ్చే కానుక
ఈ నెల 15న హీరో రామ్ పోతినేని పుట్టినరోజు. ఈ  సందర్భంగా తన అభిమానులకు రామ్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘నా ప్రియమైన అభిమానులకి, మీరు నాపై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏటా నా పుట్టినరోజుని మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో, అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను... ప్రస్తుత విపత్కర పరిస్థితుల రీత్యా ఈసారి నా పుట్టినరోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సామాజిక దూరం అందరికీ శ్రేయస్కరం! ఈ ఒక్కసారి మీరు పాటించే ఈ దూరమే.. నాకు ఇచ్చే అసలైన పుట్టినరోజు కానుకగా భావిస్తున్నాను’ అంటూ తన అభిమానులకు రామ్ విజ్ఞప్తి చేశారు.
Hero Ram
Tollywood
Birthday
Fans
Request
Social Distancing

More Telugu News