Andhra Pradesh: లాక్ డౌన్ వెసులుబాటు సమయాన్ని పెంచాలని ఏపీ సర్కారు నిర్ణయం

AP Government loosen lock down restrictions
  • కరోనా తీవ్రతలేని ప్రాంతాల్లో కార్యకాలపాలకు ఆమోదం
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు
  • సరి-బేసి విధానంలో దుకాణాలకు అనుమతి
ప్రస్తుతం సడలింపులతో కూడిన లాక్ డౌన్ అమలు జరుగుతుండగా, మరికొన్ని వెసులుబాట్లు కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కట్టడి ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని చోట్ల కార్యకలాపాలకు అనుమతించనున్నారు. అలాగే లాక్ డౌన్ వెసులుబాటు సమయాన్ని పెంచాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని దుకాణాలకు అనుమతి ఇవ్వాలని తీర్మానించారు. సరి-బేసి విధానంలో దుకాణాలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ స్పష్టం చేసింది.
Andhra Pradesh
Lockdown
Restrictions
Relief
Shops
Government

More Telugu News