Chandrababu: నర్సులు కదిలే ధవళ దేవతలు: చంద్రబాబునాయుడు

Chandrababu Naidu wishes Nurses
  • ఇవాళ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
  • నర్సులందరికీ  శుభాకాంక్షలు, కృతజ్ఞతాభినందనలు 
  • ఈ సమాజం వారికి ఎంతో రుణపడి ఉంది
సేవాభావానికి ప్రతిరూపం నర్సులు, వైద్య సిబ్బంది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు. తన అద్వితీయ సేవలతో నర్సు వృత్తికి ఎంతో గౌరవాన్ని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు.

ఈ సందర్భంగా అంకితభావంతో పేషంట్లకు సేవలందిస్తోన్న నర్సులందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నానంటూ వరుస ట్వీట్లు చేశారు. బాధిత రోగులకు వేళ తప్పకుండా మందులతో పాటు ఆత్మీయంగా సేవలు అందించే నర్సులు కదిలే ధవళ దేవతలు అని కొనియాడారు. ‘కరోనా’ పరిస్థితుల్లో నర్సులు తమ ప్రాణాలకు తెగించి మరీ సేవలందిస్తున్న తీరు ప్రశంసనీయమని, అందుకు ఈ సమాజం వారికెంతో రుణపడి ఉంటుందని అన్నారు.
Chandrababu
Telugudesam
International Nurses Day

More Telugu News