Nara Lokesh: ఆస్ట్రేలియాలో టీడీపీ మద్దతుదారుడు మృతి... తీవ్ర విచారం వ్యక్తం చేసిన నారా లోకేశ్

Nara Lokesh condoles for sudden demise of party supporter in Sydney
  • సిడ్నీలో సాయితేజ వంకినేని హఠాన్మరణం
  • సాయితేజ సేవలు చిరస్మరణీయం అంటూ ట్వీట్ చేసిన లోకేశ్
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో సాయితేజ వంకినేని అనే టీడీపీ మద్దతుదారుడు హఠాన్మరణం చెందడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సాయితేజ ఆకస్మిక మరణం తనను తీవ్ర విచారానికి గురిచేసిందని లోకేశ్ ట్వీట్ చేశారు. టీడీపీ ఆస్ట్రేలియా విభాగం తరఫున పార్టీకి సాయితేజ అందించిన సేవలు చిరస్మరణీయం అని పేర్కొన్నారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని, త్వరలోనే వారితో మాట్లాడతానని వెల్లడించారు.
Nara Lokesh
Saiteja Vankineni
Telugudesam
TDP
Sydney
Australia

More Telugu News