Tamil Nadu: తమిళనాడు నుంచి 889 మందితో శ్రీకాకుళం చేరుకున్న రైలు

Shramik Rail Reach Srikakulam from Tamilnadu
  • పది నెలల క్రితం చెన్నైకి వలస
  • వీరిలో 635 మంది మత్స్యకారులు
  • విజయనగరం వాసులు 35 మంది
తమిళనాడు నుంచి 889 మంది వలస కార్మికులతో బయలుదేరిన శ్రామిక్ రైలు ఈ ఉదయం శ్రీకాకుళం చేరుకుంది. రైలులో జిల్లాకు చేరుకున్న వారందరూ పది నెలల క్రితం చెన్నై వలస వెళ్లారు. వీరిలో 635 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 35 మంది ఉండడంతో వారిని రెండు బస్సుల్లో విజయనగరం తరలించారు. మిగతా వారిని సరుబుజ్జలి వెన్నెల వలస నవోదయ, శ్రీకాకుళం డెంటల్ కాలేజీ, చిలకపాలెం శివానీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
Tamil Nadu
Chennai
Srikakulam District
Migrant workers

More Telugu News