Corona Virus: హైదరాబాద్ లో ప్రముఖ సినీనటి కుమారుడికి కరోనా!

Senior Actress son tested corona positive
  • అత్తగారింటికి వచ్చిన యువకుడు
  • కరోనా సోకడంతో ఆసుపత్రికి తరలింపు
  • అపార్టుమెంట్ లోని అందరికీ వైద్య పరీక్షలు
  • భారీగా పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య
హైదరాబాద్ నగరంలో మరోమారు కరోనా విజృంభించింది. సోమవారం నాడు ఏకంగా 79 కేసులు నమోదు కాగా, వీటిల్లో మూడోవంతు జియాగూడలోనే నమోదయ్యాయి. దిల్ సుఖ్ నగర్ పరిధిలోని ఓ అపార్టు మెంట్ లో 9 మంది కరోనా పాజిటివ్ గా తేలారు. వీరిలో ఓ ప్రముఖ సినీనటి కుమారుడు కూడా ఉన్నారు. ఇటీవల తన అత్తగారింటికి వచ్చిన ఈయన, వైరస్ బారిన పడటంతో, ఆ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న 27 మందినీ వైద్యులు పరీక్షల నిమిత్తం తరలించారు. కాగా, గోప్యత నిమిత్తం ఎవరి పేర్లనూ అధికారులు వెల్లడించడం లేదన్న సంగతి తెలిసిందే.

జియాగూడ ప్రాంతంలో ఇప్పటివరకూ 68 కేసులు రాగా, సోమవారం నాడే 25 వచ్చాయి. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించి, కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. మలక్ పేటలో పనిచేస్తున్న ఓ మహిళకు, సికింద్రాబాద్ లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ లో పనిచేస్తున్న ఆమె కుమార్తెకు వ్యాధి సోకింది. వెంటనే సదరు సెంటర్ ను అధికారులు మూసివేయించి, ఉద్యోగులను క్వారంటైన్ చేశారు. మూసాపేట, యూసుఫ్ గూడ, చాదర్ ఘాట్, మలక్ పేట, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి.
Corona Virus
Lockdown
Hyderabad
Actress

More Telugu News