Corona Virus: కరోనా అప్‌డేట్‌: దేశంలో 70 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

Spike of 3604 COVID19 cases in the last 24 hours
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 3,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 87 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,293కి చేరింది.

గత 24 గంటల్లో దేశంలో 3,604 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 70,756కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 22,454 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 46,008 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News