Reliance: ముఖేశ్ అంబానీ సంస్థలో మరో రెండు భారీ పెట్టుబడులు

Saudi and US investors to invest in Jio
  • జియోలో పెట్టుబడులు పెట్టనున్న సౌదీ, అమెరికా సంస్థలు
  • ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ఫేస్ బుక్, విస్తా ఈక్విటీ
  • తాజా పరిణామాలతో పెరుగుతున్న రిలయన్స్ షేర్ వాల్యూ
అన్ని రంగాలపై కరోనా  వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. కంపెనీలన్నీ మహమ్మారి ప్రభావంతో ఇబ్బందులు పడుతుంటే ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్ మాత్రం వెల్లువెత్తుతున్న విదేశీ పెట్టుబడులతో కళకళలాడుతోంది. తాజాగా సౌదీ అరేబియా, అమెరికాకు చెందిన రెండు సంస్థలు జియోలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి.

జియోలో 320 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ అరేబియాకు చెందిన వెల్త్ ఫండ్ సంస్థ ఆసక్తిని కనబరుస్తోంది. మరోవైపు అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ ఫర్మ్ జనరల్ అట్లాంటిక్ 850 మిలియన్ డాలర్ల నుంచి  950 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది. ఈ డీల్స్ ఈ నెలాఖరుకల్లా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే జియోలో ఫేస్ బుక్, విస్తా ఈక్విటీలు భారీ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. జియోలో జరుగుతున్న పరిణామాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ వాల్యూ పెరుగుతోంది.
Reliance
Jio
Mukesh Ambani
Investments
Saudi Arabia
USA

More Telugu News