Perni Nani: ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచామన్నది అవాస్తవం: మంత్రి పేర్ని నాని

Minister Perni Nani Statement
  • లాక్ డౌన్  తర్వాత కూడా ఛార్జీలు పెంచే  ఆలోచన లేదు
  • ఛార్జీలు పెంచామంటూ దుష్ప్రచారం చేస్తే ఊరుకోం
  • అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు
ఏపీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలను ప్రభుత్వం పెంచిందంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రజలకు మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచామనేది అవాస్తవమని చెబుతూ ఓ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత కూడా ఛార్జీలు పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచామంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Perni Nani
YSRCP
APSRTC
Bus charges

More Telugu News