Sensex: నష్టాల బాట పట్టించిన బ్యాంకులు.. చివరి 45 నిమిషాల్లో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు!

  • 81 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 12 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా నష్టపోయిన ఐసీఐసీఐ బ్యాంక్
Sensex slides int to losess in last 45 minutes

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ఉదయం నుంచి లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు... చివరి 45 నిమిషాల్లో నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురికావడమే దీనికి కారణం.

ఇక ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 81 పాయింట్లు నష్టపోయి 31,561కి పడిపోయింది. నిఫ్టీ 12 పాయింట్లు కోల్పోయి 9,239 వద్ద స్థిరపడింది. ఆటో సూచీ మాత్రం 4.23 శాతం లాభపడింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హీరో మోటో కార్ప్ (6.29%), బజాజ్ ఆటో (6.17%), మారుతి సుజుకి (5.89%), టీసీఎస్ (2.21%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.82%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-5.23%), కోటక్ మహీంద్ర బ్యాంక్ (-2.43%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.84%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.82%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.54%).

More Telugu News