ఆన్ లైన్ లో మద్యం అమ్మకాల అంశాన్ని పరిశీలించాలని భావిస్తున్న తెలంగాణ
- తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- ఇప్పటివరకు 1196 పాజిటివ్ కేసులు
- కేసులు పెరిగితే మద్యం విక్రయాలపై చర్యలుంటాయన్న మంత్రి
దీనిపై ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఆన్ లైన్ మద్యం అమ్మకాలపై చర్చిస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి కట్టడి చేసే క్రమంలో మద్యం డోర్ డెలివరీ అంశాన్ని కూడా పరిశీలిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టయితే మద్యం విక్రయాలపైనా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. భౌతికదూరం అమలు చేయని దుకాణాలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.