Telugu Student: ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థి మృతి

  • ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదువుతున్న సతీశ్ రెడ్డి
  • సతీశ్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా బెస్తపల్లి
  • మంచం పైనుంచి కిందపడడంతో తలకు గాయం
  • మెదడుకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు
ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన ఓ యువకుడు విషాదకర పరిస్థితుల్లో కన్నుమూశాడు. కడప జిల్లా బెస్తపల్లి గ్రామానికి చెందిన సతీశ్ రెడ్డి రెండేళ్ల కిందట వైద్య విద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లాడు. అయితే ఏప్రిల్ 25న హాస్టల్ లోని తన బెడ్ పై నుంచి కిందపడడంతో తలకు బలమైన గాయం అయింది. ఆసుపత్రికి తరలించగా వైద్యులు మెదడుకు శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ సతీశ్ రెడ్డి ఆరోగ్యపరిస్థితి మరింత విషమించగా, ఆదివారం నాడు తుదిశ్వాస విడిచాడు.

ఈ వార్త తెలియడంతో సతీశ్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. ఈ విద్యార్థి తల్లిదండ్రులు కువైట్ లో ఉంటున్నారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు ఉండడంతో... ప్రభుత్వం జోక్యం చేసుకుని మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని, సతీశ్ రెడ్డి తల్లిదండ్రులను కూడా కువైట్ నుంచి రప్పించేందుకు సాయపడాలని  బంధువులు కోరుతున్నారు.
Telugu Student
Ukraine
Death
Kuwait
Kadapa District
Lockdown

More Telugu News