Varla Ramaiah: విజయసాయి రెడ్డి గారు! ‘ఎల్జీ పాలిమర్స్’ మీ ట్రస్టులో పెద్ద మొత్తం జమ చేసిందంటున్నారు.. నిజమేనా?: వర్ల రామయ్య

Varla Ramaiah allegations on Vijayasaireddy
  • మీ ట్రస్ట్ లో ఎంత జమ చేశారు?’
  • జమ చేశాకనే ఆ కంపెనీకి అనుమతి ఇచ్చారా? 
  • అందుకేనా, మీరు విశాఖకు దూరంగా ఉంటున్నారు?
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ విస్తరణకు టీడీపీ హయాంలో చంద్రబాబు అనుమతులిచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా, టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. ‘విజయసాయి రెడ్డి గారు! ఎల్జీ పాలిమర్స్ మీ ట్రస్టులో పెద్ద మొత్తం జమ చేసినట్లుగా అందరు అంటున్నారు. నిజమేనా? ఎంత జమ చేసినారు?’ అని ప్రశ్నించారు. మీ ట్రస్ట్ లో జమ చేసిన తర్వాతే ఆ కంపెనీకి అనుమతి ఇచ్చారా? అందుకేనా, మీరు విశాఖకు దూరంగా ఉంటున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాస్తవాలన్నింటినీ పత్రికాముఖంగా  విశాఖ వాసులకు తెలియజేయండి అంటూ ఓ ట్వీట్ చేశారు.
Varla Ramaiah
Telugudesam
Vijayasai Reddy
YSRCP

More Telugu News