Nara Lokesh: 'ఛార్జీల బాదుడు.. ఇది వైఎస్ జగన్ మార్క్ దోపిడీ' అంటూ వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్

lokesh fires on ycp leaders
  • వైఎస్‌ జగన్ గారి విద్యుత్ బిల్లుల గారడీ
  • స్లాబ్ మార్చిన జగన్ సర్కార్
  • పేద ప్రజలు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టేలా చేసింది
  • పనులు లేవు, తినడానికి తిండి లేదు.. రూ.వేల బిల్లు వచ్చింది
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలను అమాంతం పెంచేశారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆయన పోస్ట్ చేశారు.

'వైఎస్‌ జగన్ గారి విద్యుత్ బిల్లుల గారడీ.. స్లాబ్ మార్చిన జగన్ సర్కార్.. పేద ప్రజలు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టేలా చేసింది. పనులు లేవు, తినడానికి తిండి లేకపోతే వేల రూపాయిల విద్యుత్ బిల్లులు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు' అని చెప్పారు. తమకు ఇంతకు ముందు రూ.300 విద్యుత్‌ బిల్లు వచ్చేదని, ఇప్పుడు రూ.1500 వచ్చిందని ఈ సందర్భంగా కొందరు చెప్పిన వీడియోలను లోకేశ్ పోస్ట్ చేశారు.  
 
'బాదుడే... బాదుడు... వైఎస్ జగన్ మార్క్ దోపిడీ. జగన్ విద్యుత్ బిల్లులు పెంచేసి విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నారు అని వైకాపా నాయకులు దరువు వెయ్యడమే ఆలస్యం' అని ఎద్దేవా చేశారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News