ధాన్యం కొనుగోలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది: నిమ్మల రామానాయుడు
- ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆరోపణ
- రైతులు మద్దతుధర కోల్పోతున్నారంటూ వ్యాఖ్యలు
- ఈ-కర్షక్ నిబంధనలతో రైతులను తిప్పుతున్నారంటూ ఆగ్రహం
అన్నం పెట్టే రైతు నోటికి సున్నం పెడుతోందని, ఈ-కర్షక్ నిబంధనలతో రైతులను తిప్పుతున్నారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 16 లక్షల టన్నుల ధాన్యానికి 10 లక్షల టన్నులకే అనుమతి ఇచ్చారని, మిగిలిన 6 లక్షల టన్నుల ధాన్యం ఎవరికి అమ్ముకోవాలని నిలదీశారు.