Srimukhi: శ్రీముఖి పుట్టినరోజున సర్ ప్రైజ్ చేసిన ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’

It s time party movie first look release
  • శ్రీముఖి నటిస్తున్న కొత్త చిత్రం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’
  • ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రయూనిట్
  • ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న గౌతమ్ ఈవీఎస్
ప్రముఖ యాంకర్ శ్రీముఖి నటిస్తున్న కొత్త చిత్రం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’. ఇవాళ శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఆమెను సర్ ప్రైజ్ చేస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, ఈవీఎస్ గౌతమ్ నిర్మించారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న గౌతమ్ ఈవీఎస్ మాట్లాడుతూ, ఈ చిత్రం సైబర్ క్రైమ్ థ్రిల్లర్ అని, నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుందని, సినిమాలో శ్రీముఖి ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు కానీ, ఆమెది చాలా కీలకమైన పాత్ర అని తెలిపారు.
Srimukhi
anchor
Artist
It`s time party
firsrt look

More Telugu News