హైదరాబాద్ ఎల్బీనగర్ లో కొంపముంచిన బర్త్ డే పార్టీ... 45 మందికి కరోనా
- మిత్రుడి కోసం వేడుకలు నిర్వహించిన దుకాణదారు
- ఎల్బీ నగర్ ఏరియాలో మరింత విస్తరించి కరోనా
- 15 కంటైన్మెంట్ క్లస్టర్ల ఏర్పాటు
సదరు దుకాణదారు సరూర్ నగర్ నివాసి. మలక్ పేట్ గంజ్ లో ఆయనకు ఓ దుకాణం ఉంది. అయితే తన మిత్రుడి కోసం జన్మదిన వేడుకలు నిర్వహించాడు. అప్పటికే ఆ వ్యాపారికి తన దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా కరోనా సోకింది. ఈ విషయం తెలియక పార్టీలో పాల్గొనడంతో అతడి మిత్రుడికి కూడా కరోనా వ్యాప్తి చెందింది. ఆ విధంగా మొత్తం 45 మంది కరోనా బారినపడ్డట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో రెండు కంటైన్మెంట్ క్లస్టర్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగింది.