Chandrababu: గ్యాస్ లీక్ దుర్ఘటన కొందరు తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చింది: చంద్రబాబు

chandrababu on gas leak
  • అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు
  • గ్యాస్ లీక్‌ ఘటన బాధ నుంచి వారు త్వరగా కోలుకోవాలి
  • వారికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని  ప్రసాదించాలి
అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు వ్యాఖ్యలు చేశారు. 'ఈ రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం. కానీ, దురదృష్టవశాత్తు విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన కొందరు తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ బాధ నుంచి వారు త్వరగా కోలుకునే ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ఈ సందర్భంగా మనమందరం కోరుకుందాం' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.                                                      
       
Chandrababu
Telugudesam
Vizag Gas Leak

More Telugu News