Amitabh Bachchan: కౌన్ బనేగా కరోడ్ పతి 12వ సీజన్ తొలి ప్రశ్న ఇదే!

KBC Season 12 First Question on Corona
  • కంటెస్టెంట్ల ప్రశ్నలు సిద్ధం
  • కరోనాపై తొలి ప్రశ్నను అడిగిన అమితాబ్
  • మే 22 వరకూ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం
భారత టెలివిజన్ చరిత్రలో నూతన శకానికి నాందిగా నిలిచిన కౌన్ బనేగా కరోడ్ పతి 12వ సీజన్ మొదలైంది. ఇప్పటికే షోలో పాల్గొనే కంటెస్టెంట్ల సెలక్షన్ ప్రారంభమైంది. త్వరలోనే ఈ కార్యక్రమం సోనీ టీవీలో ప్రసారం కానుంది. బిగ్ బీ అమితాబ్ వ్యాఖ్యాతగా  కొనసాగనున్న సీజన్ తొలి ప్రశ్న ఏంటో తెలుసా? ప్రపంచాన్ని పీడిస్తున్న మహమ్మారి కరోనాపై తొలి ప్రశ్నను అమితాబ్ అడిగారు. "2019 లో చైనాలో తొలిసారిగా కరోనా వైరస్‌ను ఎక్కడ గుర్తించారు?" అని ప్రశ్నిస్తూ, నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రోమో ఇప్పుడు సోనీ టీవీలో వైరల్ అవుతోంది. సీజన్-12లో పాల్గొనాలని భావించే వారు మే 22 వరకూ అడిగే ప్రశ్నలకు ఎస్ఎంఎస్ లేదా సోనీ లైవ్ యాప్ ద్వారా ఆన్సర్ చేయాల్సి వుంటుంది. 
Amitabh Bachchan
KBC
Sason 12

More Telugu News