Juvvadi Ratnakar Rao: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూత!

Ex Minister Juvvadi Passes Away
  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జువ్వాడి
  • తన స్వగృహంలోనే తుదిశ్వాస
  • వైఎస్ హయాంలో దేవాదాయ మంత్రిగా సేవలు
సీనియర్‌ రాజకీయ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ రావు ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కరీంనగర్ ‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారని కుటుంబీకులు వెల్లడించారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఓ దశలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా ముద్రపడిన ఆయన, వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు బుగ్గారం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జువ్వాడి, 2009 ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జువ్వాడి మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.
Juvvadi Ratnakar Rao
Passes Away
Karimnagar District
Korutla

More Telugu News