Guntur District: తాడేపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రకాశ్‌నగర్‌లో భయం భయం!

corona cases raised in Tadepalli
  • తాడేపల్లిలో ఏడుకు పెరిగిన కేసులు
  • నిన్న ఒకే ప్రాంతంలో ఇద్దరికి కరోనా
  • ఇటీవల అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిన్న కొత్తగా మరో రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరుకోగా, ఒకరు మృతి చెందారు. నాలుగు రోజుల క్రితమే రెండు కేసులు నమోదు కావడం,  ఇప్పుడు మరో రెండు కేసులు వెలుగు చూడడంతో స్థానికుల్లో భయం మొదలైంది.  ఇక, శనివారం వెలుగు చూసిన రెండు కేసులు ప్రకాశ్‌నగర్‌లోనివే కాగా, ఇటీవల చనిపోయిన వ్యక్తి కూడా ప్రకాశ్ నగర్‌కు చెందిన వ్యక్తే కావడం గమనార్హం.

మరోవైపు, ఇటీవల చనిపోయిన వ్యక్తికి నిర్వహించిన స్వాబ్ పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విజయవాడ, తాడేపల్లిలో ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులు 43 మందిని గుర్తించి పరీక్షలు చేశారు. వీటిలో కొన్నింటి ఫలితాలు నిన్న వచ్చాయి. ఇటీవల చనిపోయిన వ్యక్తి భార్య, ఆయన కుమారుడికి కూడా కరోనా సోకినట్టు వీటిలో తేలింది.
Guntur District
Tadepalli
Andhra Pradesh
Corona Virus

More Telugu News