Shamshabad: 46 రోజుల తరువాత శంషాబాద్ కు తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్... కువైట్ నుంచి వచ్చిన 200 మంది!

  • శనివారం రాత్రి శంషాబాద్ చేరుకున్న విమానం
  • 200 మంది తెలుగువారిని తీసుకువచ్చిన అధికారులు
  • ఎంచుకునే ప్యాకేజీని బట్టి క్వారంటైన్ లో సదుపాయాలు
Flight Landed in RGIA from Kuwait

వందే భారత్ మిషన్ లో భాగంగా కువైట్ లో చిక్కుకుపోయిన తెలుగువారు గత రాత్రి 10 గంటల సమయంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీరిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరినీ క్వారంటైన్ చేశామని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం హోటల్స్ సిద్ధం చేశామని, రూ. 5 వేల నుంచి రూ. 30 వేల వరకూ ప్యాకేజీలు ఉన్నాయని, డబ్బు చెల్లించి, క్వారంటైన్ సెంటర్లలో కావాల్సిన సదుపాయాలు పొందవచ్చని, ప్రయాణికుల్లో ఉన్న కూలీలను ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ కు తరలించామని తెలిపారు.

ఏపీకి చెందిన వారిని కూడా ఇక్కడే క్వారంటైన్ చేయనున్నామని, ఈ విషయంలో ఏపీ అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలియజేశారు. కాగా, 46 రోజుల తరువాత విదేశం నుంచి ఓ విమానం హైదరాబాద్ కు రావడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరికీ ఎయిర్ పోర్టులోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని, అందరి టెంపరేచర్, ఇతర ఆరోగ్య వివరాలను రికార్డు చేస్తున్నామని తెలిపారు.

More Telugu News