Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలిపిన రీతూవర్మ

Ritu Varma greets on Vijaya Devarakonda birthday
  • నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు
  • నీవు ఎదిగిన తీరును చూసి గర్వపడుతున్నానన్న రీతూవర్మ
  • ఇలాగే ఎదగాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా విజయ్ కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 'పెళ్లిచూపులు' సినిమాలో విజయ్ కు జంటగా నటించిన రీతూవర్మ కూడా విషెస్ తెలిపింది. 'హ్యాపీ బర్త్ డే విజయ్. మన 'పెళ్లిచూపులు' సినిమాకు నిర్మాత కోసం కష్టపడటం దగ్గర నుంచి... స్టార్ గా ఎదగడం  వరకు... సొంతగా సినిమాలను నిర్మించేంత వరకు... నీవు ఎంతో దూరం ప్రయాణించావు. నీవు ఎదిగిన తీరును చూసి చాలా గర్వపడుతున్నా. నీవు ఇలాగే ఎదగాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేసింది. దీంతో పాటు విజయ్ దేవరకొండతో కలసి దిగిన ఫొటోను షేర్ చేసింది.
Vijay Devarakonda
Ritu Varma
Tollywood
Birthday

More Telugu News