Corona Vaccine: స్వదేశీ కరోనా వ్యాక్సిన్ తయారీలో.... ఐసీఎంఆర్ తో భారత్ బయోటెక్ భాగస్వామ్యం

ICMR and Bharat Biotech join hands to make corona vaccine possible
  • దేశీయంగా వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు
  • భారత్ బయోటెక్ కు ఐసీఎంఆర్ సహకారం
  • ఇప్పటికే వైరస్ సాంకేతికత బదిలీ చేసిన పుణే ఎన్ఐవీ
దేశీయంగా కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ కు ఐసీఎంఆర్ సహకారం అందించనుంది. పుణేలో నేషనల్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ (ఎన్ఐవీ) కూడా భారత్ బయోటెక్ కు సహకరించనుంది. ఎన్ఐవీ ఇప్పటికే కరోనా వైరస్ కు సంబంధించిన సాంకేతికతను భారత్ బయోటెక్ కు బదిలీ చేసింది. వ్యాక్సిన్ త్వరితగతిన ఆమోదం పొందేందుకు వీలుగా ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్త కార్యాచరణ రూపొందించాయి.
Corona Vaccine
ICMR
Bharat Biotech
Pune NIV
India
COVID-19

More Telugu News