Nallapureddy: కోటి రూపాయల పరిహారం ఇవ్వడం తప్పా?: చంద్రబాబుపై ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్

Nallapureddy Prasanna Kumar Reddy fires on Chandrababu
  • కోటి పరిహారం ఇవ్వడం కూడా తప్పేనా?
  • చంద్రబాబు ఎప్పుడైనా కోటి రూపాయలు ఇచ్చారా?
  • కోటి రూపాయలు ఎవరిమ్మన్నారని చంద్రబాబు అడుగుతున్నారు
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ప్రమాదం రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. విశాఖ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వడం కూడా తప్పేనా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడైనా ఇంత స్థాయిలో పరిహారం ఇచ్చారా? అని నిలదీశారు. చంద్రబాబు ఎప్పుడైనా కోటి రూపాయలు ఇచ్చారా? అని దుయ్యబట్టారు. కోటి రూపాయలు ఎవరిమ్మన్నారని చంద్రబాబు అడుగుతున్నారని మండిపడ్డారు.
Nallapureddy
YSRCP
Chandrababu
Telugudesam
Vizag Gas Leak

More Telugu News