Vizag Gas Leak: ఈమె క్షోభ చూసి గుండె బద్దలవుతోంది: వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు

Chadrababu posts a video of mother who lost her daughter in Vizag Gas leakage
  • విశాఖ ఘటనలో కూతురుని కోల్పోయిన తల్లి
  • కూతురే తన ప్రపంచం అంటూ రోదన
  • డీజీపీని అడ్డుకున్న బాధితురాలు
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. తమ సర్వస్వం అనుకున్న వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. కన్నకూతురుని కోల్పోయిన ఓ మహిళ రోదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీనికంతా కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కూడా ఆమె నిలదీశారు. ఈ వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

'కన్నకూతురుని కోల్పోయిన తల్లి బాధను చూసి నా హృదయం బద్దలవుతోంది. తన ప్రపంచం కూతురే అని ఆమె చెబుతోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఏపీ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Vizag Gas Leak
Chandrababu
Telugudesam

More Telugu News